Important Old G.Os & Information

Saturday 14 November 2015

RPS 2015 released GOs realted informarion

పి. ఆర్. సి 2013 ప్రతిపాదనలు అమలుకు ప్రభుత్వం జారి చేసిన జీ.వోలను మీ ముందుకు తీసుకువస్తున్నాను.

1. మన రాష్ట్ర శాఖ పట్టు బట్టి సాదించిన 43% పిట్మెంట్ కి సంబందించి G.O.Ms.No. 25 Dt. 18.03.2015 ద్వారా ఇచ్చారు ఈ ప్రధాన ఉత్థర్వులో పిట్మెంట్ తోపాటు, మాస్టర్ స్కేలు, 01.07.2013 కి కాని 30.06.2014 లోపు పొందిన  ఇంక్రిమెంట్ కు కాని 6 నెలలోపు ఆప్షన్ ఇచ్చే సౌకర్యం కల్పించారు. 32 గ్రేడులను కొనసాగిస్తూ కనీస ఫే 13,000/- లుగా గరిష్ఠ ఫే 1,10,850/- గా ఇచ్చారు. ఒక టైం స్కేలులో గరిష్ఠ ఫే ధాటిన వారికి 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అనుమతించారు. కాటగిరి వారిగ ఇచ్చిన స్కేలులొ SGT / LP / PET లకు 21230-63010 గా, School Assistant లకు 28940-78910 గా, M.E.O  పోస్టు స్కేలు ను 1 గ్రేడు పెంచుతు G.H.M-II తో సమాన స్కేలు 35120-87130 గా, గత పి.ఆర్.సి లో G.H.M-II తో సమానంగా ఉన్న Dy.E.O స్కేలును 2 గ్రేడులను పెంచుతు 40,270-93780 గా ఇచ్చారు. కొత్త వేతనాలు 01.07.2013 నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక లబ్ధి తెలంగాణ ర్రాష్ఠ్రం ఏర్పడిన రోజునుండి ఇస్తారు తేది 02.06.2014 నుండి 28.02.2015 వరకు బకాయిల కోసం ప్రత్యేక ఉత్తర్వుల ద్వార ఇస్తామని తేది 01.03.2015 నుండి చేతికిస్తామని తెలిపారు.


2 . G.O.Ms.No. 26 Dt. 18.03.2015 ప్రకారం D.A ను కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రతి 1%కి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 0.524% ను ఇవ్వమని పి.ఆర్.సి సిపారసు చేసిన విదంగా అనుమతించింది. కాని కేంద్రప్రభుత్వ వేతన స్థిరీకరణ 01.01.2016 కి జరిగిన పిదప వారికి ఇచ్చే కరువు భత్యం పై ప్రతి 1% కు మనకు ఎంత శాతం పెంచాలో గణించి ప్రభుత్వానికి ప్రాతినిత్యం చేయవలసి ఉన్నది.


3.  ఇంటి అద్దె అలవెన్స్ కొరకు G.O.Ms.No. 27. Dt. 18.03.2015 ప్రకారం 30% HRA పొందుతున్న ఉద్యోగులకు గరిష్ట పరిమితిని 12,000/- నుండి 20,000/- లకు మిగతా ప్రాంతాలకు 8,000/- నుండి 15,000/- కు పెంచడం జరిగినది.  మహబూబ్ నగర్ పట్టణానికి  HRA 14.5% నుండి 20% కు పెంచారు. మన రాష్ట్ర శాఖ ప్రాతినిద్యం చేసి కోదాడ పట్టణానికి 14.5% HRA ను G.O.Ms.No. 88 Dt. 10.06.2015 ప్రకారం ఇప్పించనయినది.


4.  CCA ని G.O.Ms.No 28 Dt. 18.03.2015 ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిది మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు   అయిన కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాలకు చెందిన ఉపాధ్యాయులకు వివిధ బేసిక్ పేలకు అనుగుణముగా 200 నుండి 1000 రూపాయలు వరకు చెల్లిస్తారు.


5.  ఆర్.పి.యస్ విదాన పరమైన సూచనల కోసం Memo No. 68/1/HRM.IV/2014 Dt. 04.04.2015 లో ఏవిదంగా ఆప్షన్ లను ఇవ్వాలో ఉదాహరణలతో వివరిస్తూ వేతన స్తిరీకరణకు అవసరమైన Forms ని ఇవ్వడం జరిగినది.


6.   పెన్షనర్ లకి సంబందించిన పెన్షన్ స్తిరీకరణ ఉత్తర్వులను G.O.Ms.No. 33 తేది 07.04.2015 లో బేసిక్ పెన్షన్ పై 43% పిట్మెంట్  ను స్థిరీకరణ అనంతరం పెన్షన్ పెరుగుదలను పట్టికల ద్వారా తెల్పారు. కనీస పెన్షన్ 6500/- గా నిర్ణయించారు.


7.  అప్రయాత్న పదోన్నతి అమలుకోసం G.O.Ms.No. 38 తేది 15.04.2015 ప్రకారం ఇంతకు ముందు ఉన్న విధంగానే పదోన్నతి స్థిరీకరణ లో SG లేదా SPP-IA మరియు SAPP-IB పొందిన వారికి FR22-B ని కొనసాగించారు. సీనియర్ వేతనం జూనియర్ వేతనం కన్నా తక్కువ ఉంటే G.O.Ms.No. 297 తేది 25.10.1983 లో ఉన్నషరతులకు లోబడి జూనియర్ తో స్టెప్ అప్ చేసుకునే అవకాశం కొనసాగించారు.

      సర్వీసు రూల్స్ లో ప్రమోషన్ అర్హతలలో మినహాయింపు ఉన్నట్లయితే అప్రయత్న పదోన్నతి అయిన SPP-IA/ SPP-II కి వర్తిస్తుందని ఉంది కాని ఇదే విదంగా RPS 2010 కి సంబందించిన G.O.Ms.No 93 లో కూడా ఈ మినహాయింపుల గురించి ఉన్నా Finance Department వారు మెమో నం 034408 / 248 / PC.II / 2011 ద్వార 50సం. ల వయసస్సు నిండిన వారికి Departmental పరీక్షలు పాసు అవ్వాలనే నిబందన నుండి మినహాయింపును అనుమతించలేదు. 50 సం. వయసు నిండిన వారికి Departmental Test లు పాసవ్వాలనే నిబందన నుండి మినహా ఇంపు కోసం ప్రాతినిద్యం చేయవలసి ఉన్నది.


8.   అప్పులు అడ్వాన్స్  కి సంబందించిన G.O.Ms.No. 39 తేది 15.04.2015 ద్వార జారి చేశారు కాని మనకు పండగ అప్పు మాత్రమే ఇస్తున్నారు పండగ అప్పు 26600-77030 స్కేలు లోపు ఉన్న వారికి 7500 ఇస్తారు దీనిని తిరిగి 10 నెలలలో సమాన వాయిదాలలో చెల్లించాలి.


9.  G.O.Ms.No. 56 తేది 02.05.2015 లో హెడ్మాస్టర్ అలవేన్స్ లు మరియు హైస్కూల్ తరగతులను భొదించే SGT / Language Pandit Gr.-II లకు ఇచ్చే అలవెన్స్ లను పెంచూతు మానిటరి బెనిఫిట్ ని 01.05.2015 నుండి అనుమతించారు.


10. లీవ్ ట్రావెల్ కన్సేషన్ కి సంబందించిన G.O.Ms.No. 76 తేది 13.05.2015 ప్రకారం సర్వీసులో ఒకసారి అత్యదికంగా 3500 కి. మీ. దేశంలో ఎక్కడయినా వెళ్ళడానికి అవకాశాన్ని కొనసాగిస్తూ అత్యదిక చెల్లించే పరిమితిని 12,000/- నుండి 18,750/- కి పెంచారు.


11  G.O. Ms.No. 99 తేది 21.07.2015 ద్వారా రిటర్మెంట్ గ్రాట్యూటి పరిమితిని 8 లక్షల నుండి 12 లక్షలకు పెంచారు. మన రాష్ట్ర శాఖ ప్రాతినిద్యం చేసి గ్రాట్యూటికీ డి.ఏ ను కల్పి గణించుకునేలా మెమో నం. 9026-A / 1882 / A2 / HRM.V / 2015 తేది 24.07.2015 ద్వారా ఇప్పించనయినది. రివైజ్డు గ్రాట్యూటిని చేతి కి 01.03.2015 నుండి చేల్లిస్తారు. తేది 02.06.2014 నుండి 28.02.2015 మధ్యకాలపు ఎరియర్స్ కి సంబందించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారిచేస్తారు. 


12.  G.O.Ms.No. 100 తేది 21.07.2015 ద్వారా పెన్షనర్ లకు చెల్లించే నెలవారీ మెడికల్ అలవెన్సును 200/- నుండి 350/- కి పెంచారు కాని అడిషనల్ క్వాంటం పెన్షన్ ఇంతకు ముందు ఉన్న విదానాన్ని కొనసాగించాలని చెప్పారు.


13.  సర్వీస్ పెన్షనర్, ప్యామిలీ పెన్షనర్ చనిపోయిన సంధర్బంలో ఇచ్చే రిలీఫ్ ని G.O.Ms.No 101 తేది 21.07.2015 ప్రకారం 20,000/- లకు పెంచడం జరిగినది. సర్వీసులో ఉన్నవారు చనిపొతే ఈ పెరిగిన రిలీఫ్ కు సంభందించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది.


14.  గ్రుడ్డి మరియు శారీరక అంగవైకల్యం కలవారికి ఇచ్చే Conveyance Allowance తేది 01.07.2015 నుండి గరిష్టం గా 2000/- కు G.O.Ms.No. 103 తేది 24.07.2015 ప్రకారం పెంచారు.     15.  నాన్ గజిటెడ్ ఉద్యోగుల పిల్లల పీజు Reimbursement ను G.O.Ms.No. 27 తేది 24.09.2015 ద్వారా 2,500/- కు పెంచారు కాని ఈ పెరుగుదల వర్తింపు 2015-16 అకాడమిక్ సంవత్సరం నుండి వర్తిస్తుంది.  

0 comments:

Post a Comment