Important Old G.Os & Information

Tuesday 30 January 2018

Medical Reimbursement Extended upto March, 2018

Telangana state Government has released G.O.Ms.No. 6 for Health, Medical & Family Welfare Department – Employees Health Scheme – Providing Cashless Medical treatment to the State Government Employees, Pensioners and their dependent family members – Extended up to March, 2018.

G.O.Ms.No. 6 dt. 30.01.2018

Monday 8 January 2018

Government of India Ministry of Finance Department of Revenue Central Board of Direct Taxes as issued Circular 29 / 2017 to Income Tax deduction from salaries during the financial year 2017-18 under section 192 of the Income Tax Act, 1961

Income Tax FY 2017 - 18 Instructions Circular 29/ 2017


Sunday 26 November 2017

Thursday 9 November 2017

Monday 6 November 2017

Income Tax FY 2017-18 AY 2018-19 Section wise Info for Salaried

2017 - 18 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన 


ఆదాయపు పన్ను శ్లాబులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న 10% శ్లాబ్ స్థానములో 5% శ్లాబ్ గా మార్చారు. మిగితా సెక్షన్ లను దాదాపుగా గత ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం  గణన లో తేది 01.04.2017 నుండి 31.03.2018 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.


Category

Slab

Tax

 Age below 60 Years
Upto 2,50,000
Nil
2,50,001-5,00,000
5% of amount by which the taxable income exceeds Rs. 2,50,000/-.
5,00,001-10,00,000
Rs. 12,500/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 1,12,500/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Age 60Yrs and above -  below 80Yrs  (Senior Citizens)
Upto 3,00,000
Nil
3,00,001-5,00,000
5% of amount by which the taxable income exceeds Rs. 3,00,000/-.
5,00,001-10,00,000
Rs. 10,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 110,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

Age 80Yrs and above                                 (Super Senior Citizens)
Upto 5,00,000
Nil
5,00,001-10,00,000
20% of amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000
Rs. 100,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

 Senior Citizen (Individual who is of the age of 60 years or more but below the age of 80 years at any time during the previous year i.e. born on or after 1st April 1938 but before 1st April 1958)


Super Senior Citizen(Individual who is of the age of 80 years or more at any time during the previous year i.e. born on or before 1st April 1938 )

Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 3.5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రిబేట్ సదుపాయాన్ని రూ. 2,500/- కు తగ్గించారు. 
* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు :- 

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు : 

 Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును. 
  1. పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం 
  2. ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ 
  3. 40% వేతనం 
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. 

మినహాయింపులు : 

  1. ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ  ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.  

  2. u/s 24 and 80 EE There is an Exemption for interest on housing loan.(for Self occupied Residence). If the loan was taken before Apr 1, 1999 exemption is limited to ₹30,000/- per year. If the loan was taken after Apr 1, 1999 exemption is limited to ₹2,00,000/- per year if the house is self-occupied; There is no limit if the house is rented out
    This exemption is available on accrual basis, which means if interest has accrued, you can claim exemption, irrespective of whether you've paid it or not.. 80EE In finance bill 2016 (an additional rebate of ₹.50.000/- was given to those assesse, who purchase self ocupied single house after 01/04/2016 with maximum value of ₹ 60 Lacs and sanctioned home loan up to 35 Lacs.)                         
  3. ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) : Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2017-18  ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 8సం. లు వర్తిస్తుంది.

  4. ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD) :   ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి. 

  5. ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) : ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

  6. అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) :  ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

  7.  చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

* Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2018 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు. 

మెడికల్ ఇన్సురెన్స్ (80D) :  ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు. 

ఉద్యోగి  సిటిజెన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు
  • కన్వేయన్స్ అలవెన్స్ కి  మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు. 


పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :

  1. వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

  2. Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) : LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

  3. CPS deduction (80CCD):                                                   కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదుప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ముపైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు  సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు  2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80సి కింద CPS నిది కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS)  నిది కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు. 

  4. * 80C, 80CCC, 80CCD  పొదుపు  పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.

అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) : Rajiv Gandhi Equity Saving Scheme దీనిని అదనంగా పన్ను మినహాయింపు పొందడానికి రూపొందించారు దీని  ద్వారా 1.5 లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు. 

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :   సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

* Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2018 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది. 

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి? 

జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDOలకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2017 లోపు Income Tax Department వారికి సమర్పించాలి. 
  

ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు?   

ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నాచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో  పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2018 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి. 

ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించుట ప్రతి పౌరుని సామాజిక, రాజ్యాంగ భాద్యత, ఉపాద్యాయులు ఈ భాద్యతను సక్రమంగా నెరవేర్చి ఉద్యోగ వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము.    

IT Department Circular for Salaried - FY 2017 - 18 - AY 2018-19 - Download

Telangana IT FY 2017-18 - Calculator - Click here

Andrapradesh IT FY 2017-18 - Calculator - Click here

Friday 22 September 2017

January, 2017 DA G.O.Ms.No. 135

Central Government has been sanctioned January 2017 DA 2% those who are drawing pay as per 7th CPC and 4% to those who are drawing pay as per 7th CPC accordingly state Government has sanctioned 2.096% (6th CPC DA 4% X 0.524 =2.096%).

January 2017 DA G.O.Ms.No. 135 Dt. 22.09.2017

January 2017 DR G.O.Ms.No. 136 Dt. 22.09.2017

Tuesday 29 August 2017

Sunday 27 August 2017

Interstate Guidelines

Telangana and Andhrapradesh both state Government  has been given guidelines to Interstate transfers under proviso to sub section (2) of section 77 of AP, Re-organisation Act-2014 mandates that employees of local, District, Zonal and Multi zonal Cadres, which fall entirely in one of the Successor States shall be deemed to allotted to that employees and State Cadre employees for transfer to the State where their spouses are working or for mutual transfers on grounds of their local candidature etc., to the state wich they belong.

Interstate Transfers Guidelines Cir.Mem No 9940/SPF&MC/2015 Dt. 07.08.2017


Commissioner and Director of School Education, Tealgana state call for fresh Proposals from those who are seeking Interstate Transfer From Telangana to Andhrapradesh.

C&DSE fresh Proposals called Rc.No 3711/Ser.IV-2/2015 Dt.23.08.2017

Friday 19 May 2017

CPS Employees - Annuity Providers - Types of Pension

ఆన్యుటి ప్రొవైడర్స్ వారీగా కొత్త పెన్షన్ వారికి అందుబాటులో ఉన్న పెన్షన్ రకాలు ఏంటి? ఎంత పెన్షన్ వస్తుంది ఒకసారి పరిశీలిద్దాం. 

ఉద్యోగి తన వాటాగా 10% చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం 10% జమచేస్తూ షేర్ మార్కెట్ లో పెట్టిన నిధితో ఉద్యోగి 58/60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ (Retirement on Superannuation) చేస్తే మొత్తం CPS  Account లో ఉన్న నిధిలోనుండి కనీసం 40% నిధితో ఆన్యుటి ప్లాన్ లలో పెట్టి పెన్షన్ పొందాలి, ఉద్యోగి వాలంటీర్ రిటైర్మెంట్ (Volunteer Retirement) తీసుకుంటే కనీసం 80% నిధితో ఆన్యుటి ప్లాన్ లలో పెట్టి పెన్షన్ పొందాలి ఉద్యోగి సర్వీస్ లో ఉండగా చనిపోతే మొత్తం CPS నిధిని 100% నామినికి చెల్లిస్తారు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి Family Pension చెల్లించారు. Pension Fund Regulatory and Development Authority (PFRDA) వారు 
Annuity Services Providers గా క్రింది వారిని ఎంపిక చేసింది. 

1) Life Insurance Corporation of India
2) SBI Life Insurance Co. Ltd
3) HDFC Life Insurance Co. Ltd
4) ICICI Prudential Life Insurance Co. Ltd
5) Star Union Dai-ichi Life Insurance Co. Ltd

6) Reliance Life Insurance Co. Ltd
7) Bajaj Allianz Life Insurance Co. Ltd
ముందుగా ప్రభుత్వరంగ సంస్థలలో పెడితే ఏవిధమైన పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి, పెన్షన్ ఎంతెంత వస్తుందో పరిశీలిద్దాం.

Life Insurance Corporation of India

Life Insurance Corporation of India వారు చాలా రకాల పెన్షన్ లను అందుబాటులో ఉంచారు అవి ఏంటో? ఎంత చెల్లిస్తారో చూద్దాం. (ఉద్యోగి వయస్సును బట్టి చెల్లించే పెన్షన్ మారుతూ ఉంటుంది) పెన్షన్ నెలనెలా లేదా 3నెలలకు గాని 6నెలలకు గాని సంవత్సరానికి ఒకసారి గాని పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు నెంవారి పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు.

58 సంవత్సరాల ఉద్యోగి పది లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి (*15% సర్వీస్ టాక్స్ అదనంగా చెల్లించాలి) ప్రతి నెల ఎంత పెన్షన్ చెల్లిస్తారో కింది పట్టికలో చూపాను.

250000/-, 500000/-, 750000/-, 1000000/- Investment  పెరుగుతూ ఉంటే పెన్షన్ ఎక్కువ చెల్లిస్తారు. నేను 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్ చేసినా కూడా గరిష్ట పెన్షన్ ఎంత వస్తదో చెప్పుతూ... కొత్త పెన్షన్ వలన లాభం లేదని తెలిసేలా  10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదికగా తీసుకున్నాను.

Pension Payable for 10 Lacks Investment
Annuity Option
Online
(High PP 1%extra) 
Offline
(i) Annuity payable for life 7277 7208
(ii-a) Annuity payable for 5 yrs and life thereafter 7235 7167
(ii-b) Annuity payable for 10 yrs and life thereafter 7117 7050
(ii-c) Annuity payable for 15 yrs and life thereafter 6966 6900
(ii-d) Annuity payable for 20 yrs and life thereafter 6772 6708
(iii) Annuity payable for life with ROC on death of annuitant 5636 5583
(iv) Annuity payable for life increasing at 3% simple pa 5880 5825
(v) Annuity payable for life with 50% annuity payable to spouse on death of annuitant 6797 6733
(vi) Annuity payable for life with 100% annuity payable to spouse on death of annuitant 6377 6317
(vii) Annuity payable for life with 100% annuity payable to spouse on death of annuitant with ROC on death of Last Survivor 5611 5558

1
Annuity Purchase price is exclusive of service tax and cess
2 Higher incentives for purchase prices over and equal to 250000/-, 500000/-, 750000/-, 1000000/-.
3 Annuity will remain constant throughout the life except ASP scheme 4 where it will increase at 3% every year.
4 Purchase price shall be returned to nominee/legal heir only under ASP scheme 3&7.
5 Annuity rates are quoted are monthly rates.

(i) Annuity payable for life : 

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా తిరిగి చెల్లించరు. 

(ii-a) Annuity payable for 5 yrs and life thereafter
(ii-b) Annuity payable for 10 yrs and life thereafter
(ii-c) Annuity payable for 15 yrs and life thereafter
(ii-d) Annuity payable for 20 yrs and life thereafter 
ఈ  (ii) a నుండి d వరకు ఉన్న ప్లాన్స్ పైన నాకు అవగాహన లేనందున దీని గురించి తెలుపలేకపోతున్నాను  

(iii) Annuity payable for life with ROC on death of annuitant : 

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. కానీ వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.

(iv) Annuity payable for life increasing at 3% simple pa : 

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు. కానీ ప్రతి సంవత్సరం పెన్షన్ లో 3% పెరుగుదల ఉంటుంది.  

(v) Annuity payable for life with 50% annuity payable to spouse on death of annuitant :

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే (సగం) 50% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.

(vi) Annuity payable for life with 100% annuity payable to spouse on death of annuitant

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.

(vii) Annuity payable for life with 100% annuity payable to spouse on death of annuitant with ROC on death of Last Survivor

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.

వివిధ వయస్సులవారికి వివిధ అమౌంట్ ఇన్సెస్ట్మెంట్ ఏవిధమైన పెన్షన్ వస్తుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు. 

LIC Annuity Plans -Click Here

SBI Life Insurance Co. Ltd


Annuity Option Pension Payable for 10 Lacks Investment
Lifetime Income (Scheme ID : AS0001001) 6873
Life time Income with Capital Refund (Scheme ID: AS001002) 5002
Life and Last Survivor - 100% Income (Scheme ID: AS001003) 5557
Life and Last Survivor with Capital Refund -100% Income (Scheme ID: AS001004) 4704
NPS - Family Income Option (Scheme ID: AS0001005) 4704
SBI Life Insurance Co. Ltd వారు 5 రకాల పెన్షన్లను అందిస్తున్నారు అవి 

Lifetime Income (Scheme ID : AS0001001) :

Annuity installment is payable, at a constant rate, throughout the life of the annuitant. On death, the payouts will cease.

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా తిరిగి చెల్లించరు. 

Life time Income with Capital Refund (Scheme ID: AS001002) :

Annuity installment is payable throughout the life of the annuitant. On death, the payouts will cease and the purchase price will be refunded.

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్తకి పెన్షన్ చెల్లించరు. కానీ వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వారి Nominee కి కానీ Legal Heir కి కానీ చెల్లిస్తారు.

Life and Last Survivor - 100% Income (Scheme ID: AS001003) :

Annuity installment is payable throughout the life of the primary (first) annuitant. On death, the payouts would be made to the second annuitant, if alive. On death of the last surviving annuitant, the payouts will cease.

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లించరు.

Life and Last Survivor with Capital Refund -100% Income (Scheme ID: AS001004):

Annuity installment is payable throughout the life of the primary (first) annuitant. On death, the payouts would be made to the second annuitant, if alive. On death of the last surviving annuitant, the payouts will cease and the purchase price will be refunded.

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లిస్తారు. 

NPS - Family Income Option (Scheme ID: AS0001005) :

Annuity payments would be made to the annuitant and his/ her spouse throughout their lifetime. Thereafter, these payouts would be made to the subscriber's mother and after her, to the father. On death of the father, the purchase price would be refunded to the annuitant's child/ nominee.

ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే ఉద్యోగి జీవించినంతకాలం పైన తెలిపిన విధంగా నెల నెల పెన్షన్ గా చెల్లిస్తారు. వీరి మరణానంతరం వీరి భార్య/భర్త బ్రతికుంటే (సమాన) 100% పెన్షన్ చెల్లిస్తారు. వీరి అనంతరం ఉద్యోగి తల్లికి బ్రతికి ఉంటే తల్లికి చెల్లిస్తారు, తల్లి అనంతరం తండ్రి బ్రతికి ఉంటే తండ్రికి చెల్లిస్తారు, తండ్రి అనంతరం ఉద్యోగి నామిని / పిల్లలకు వీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి చెల్లిస్తారు.  

వివిధ వయస్సులవారికి వివిధ అమౌంట్ ఇన్సెస్ట్మెంట్ ఏవిధమైన పెన్షన్ వస్తుందో క్రింద లింక్ ద్వారా తెలుసుకోగలరు.  

SBI Annuity Plans - Click Here

ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న పెన్షన్ ప్లాన్ ల డైరెక్ట్ లింక్ కింద ఇచ్చాను వాటిని ఒకసారి పరిశీలించండి. 

3) HDFC Life Insurance Co. Ltd

4) ICICI Prudential Life Insurance Co. Ltd

5) Star Union Dai-ichi Life Insurance Co. Ltd